
అవగాహన కల్పిస్తున్నాం
మహిళా స్వయం సహాయక సంఘాల్లో కొత్తగా కిశోర బాలికలను చేర్పించేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వారితో పాటు వికలాంగులు, వృద్ధులకు సంఘాలు ఏర్పడతాయి. గ్రామ స్థాయిలో నుంచి మండల స్థాయిలో ప్రతి ఒక్కరిని సభ్యులుగా చేర్పించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వివిధ రకాల రుణాలు అందజేస్తాం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.
– సూర్యారావు,
జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి