
తీర్థంతోపాటు ప్రసాదం
నాచగిరిలో ప్రారంభం
వర్గల్(గజ్వేల్): నాచగిరిలో భక్తులకు ఇక తీర్థంతోపాటు ప్రసాద వితరణ జరగనుంది. నిన్నటి వరకు నివేదన సమయంలో మాత్రమే భక్తులకు ప్రసాద వితరణ జరిగేది. ఇపుడు గుడి తెరిచిన వేళ స్వామివారిని దర్శించుకునే ప్రతి భక్తునికి తీర్థంతోపాటు ప్రసాద వితరణ చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం నాచగిరి లక్ష్మీనృసింహుని సన్నిధిలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ రవీందర్‌గుప్తా ప్రారంభించారు.
వ్రత శోభితం
స్వాతంత్య్రదినోత్సవ వేళ నాచగిరి భక్తులతో కిటకిటలాడింది. పెద్దసంఖ్యలో సత్యనారాయణస్వామి వ్రతాలు జరిగాయి. వ్రతమాచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.