చికిత్స పొందుతూ మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ మహిళ మృతి

Aug 16 2025 9:00 AM | Updated on Aug 16 2025 9:00 AM

చికిత్స పొందుతూ  మహిళ మృతి

చికిత్స పొందుతూ మహిళ మృతి

చికిత్స పొందుతూ మహిళ మృతి

నర్సాపూర్‌ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి చెందింది. ఎస్సై లింగం వివరాల ప్రకారం... చిన్నచింతకుంట గ్రామానికి చెందిన పోతారం ముత్యాలు గౌడ్‌ భార్య నర్సమ్మతో కలిసి టీవీఎస్‌ ఎక్సెల్‌పై నర్సాపూర్‌కు వెళ్లి సామగ్రి తీసుకొని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో నర్సాపూర్‌ – మెదక్‌ రహదారిలోని చిన్నచింతకుంట క్రాస్‌ రోడ్డు వద్ద వెనుక నుంచి పల్సర్‌ బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సమ్మకు తీవ్ర గాయాలు కాగా ఆమెను హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఆమె మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement