
అలుగు పారుతున్న జగిర్యాల చెరువు
మొన్న బీటలు.. నేడు పచ్చబడి
వర్షాలు లేక ముందు.. బీటలు బారిన వరి మడి
ఇటీవల కురిసిన వర్షాలకు పచ్చబడిన మడి
రేగోడ్(మెదక్): మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. రాత్రి ఏకధాటిగా వర్షం పడటంతో పలు గ్రామాల్లో పురాతన ఇండ్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవగా.. జగిర్యాల చెరువు అలుగు పారుతోంది. చెరువును చూసేందుకు పర్యావరణ ప్రేమికులు తరలి వస్తున్నారు. స్థానిక తహసీల్దార్ దత్తారెడ్డి, ఆర్‌ఐలు ఫెరోజ్, విజయలక్ష్మి చెరువును సందర్శించారు. చెరువు అలుగు పారుతుండటం వల్ల వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని తహసీల్దార్ సూచించారు.
జగదేవ్‌పూర్(గజ్వేల్): మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన రైతు నర్సింహులు వానాకాలం సీజన్‌లో రెండెకరాల్లో వరి సాగు చేశాడు. వర్షాలు సకాలంలో కురవక రెండు వరి మడులు నీళ్లు లేక బీటలు బారాయి. బోరులో కూడా నీరు తగ్గడం వల్ల పొలానికి నీరు అందలేదు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షానికి బీటలు పడిన మడి నీటితో నిండి వరి పొలం పచ్చబడింది.

అలుగు పారుతున్న జగిర్యాల చెరువు

అలుగు పారుతున్న జగిర్యాల చెరువు