కారును ఓవర్‌టేక్‌ చేయబోయి.. | - | Sakshi
Sakshi News home page

కారును ఓవర్‌టేక్‌ చేయబోయి..

Dec 15 2023 4:42 AM | Updated on Dec 15 2023 12:01 PM

- - Sakshi

అబ్దుల్‌ రెహమాన్‌ (ఫైల్‌)

పటాన్‌చెరు టౌన్‌: లారీని బైక్‌ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులకి తీవ్ర గాయాలు కాగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన బీడీఎల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శివకుమార్‌ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అబ్దుల్‌ రెహమాన్‌(19), ఖాసీం ఇద్దరూ బతుకుదెరువు కోసం ఏడాది కిందట వచ్చి బొల్లారం పరిధిలోని గాంధీనగర్‌లో ఉంటున్నారు. ఫాల్‌ సీలింగ్‌ వర్క్‌ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

గురువారం ఉదయం ఇద్దరూ పని నిమిత్తం బైక్‌పై శంకర్‌పల్లి వైపు బయలుదేరారు. ముత్తంగి సర్వీస్‌ రోడ్‌ నుంచి కర్ధనూర్‌ వైపు వెళ్తుండగా కారును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందులో చికిత్స పొందుతూ అబ్దుల్‌ రెహమాన్‌ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.
ఇవి చ‌ద‌వండి: పుట్టపర్తిలో దారణం.. అనుమానంతో భర్త!

Advertisement
 
Advertisement
Advertisement