కూతురు పెళ్లి జరిగిన కొద్దిసేపటికే ఆగిన తండ్రి గుండె | - | Sakshi
Sakshi News home page

కూతురు పెళ్లి జరిగిన కొద్దిసేపటికే ఆగిన తండ్రి గుండె

Sep 5 2023 6:38 AM | Updated on Sep 5 2023 11:51 AM

- - Sakshi

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): కూతురికి ఉదయం వైభవంగా పెళ్లి చేసి సాయంత్రం అత్తవారింటికి పంపే తంతూ కొనసాగుతుండగా ఓ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ పెళ్లింట విషాదం నెలకొంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని ముబారక్‌ పూర్‌(బి) గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొరుబాయిని శ్రీశైలం(46) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

తన భార్య అనారోగ్యంతో ఆరు నెలల క్రితం మృతి చెందింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు మానస వివాహాన్ని ఈనెల 3న ఆదివారం సదాశివపేట పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్లో బంధుమిత్రుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించాడు. సాయంత్రం తన స్వగృహంలో అప్పగింతలు జరుగుతున్న సమయంలో శ్రీశైలంకు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు.

వెంటనే సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. చిన్న కూతురు అనూష అనాథగా మిగలడంతో బంధుమిత్రులు కన్నీరు మున్నీరయ్యారు. సోమవారం గ్రామంలో శ్రీశైలం అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement