ఆక్రమణలపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలపై ఉక్కుపాదం

Oct 30 2026 7:30 AM | Updated on Oct 30 2026 7:30 AM

ఆక్రమణలపై ఉక్కుపాదం

ఇబ్రహీంపట్నం: అనుమతిలేని నిర్మాణాలు, ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై మున్సిపల్‌ అధికారులు ఉక్కుపాదం మోపారు. పోలీసుల సహకారంతో గురువారం మున్సిపల్‌ సిబ్బంది గురునానక్‌ విద్యాసంస్థ సమీపంలోని టీచర్స్‌ కాలనీలో అనుమతులకు మించి నిర్మించిన భవనాలను కొంత భాగం కూల్చివేశారు. మంచాల రోడ్డులో ఫుట్‌పాత్‌ ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ సిబ్బందితో కొందరు వాగ్వాదానికి దిగారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం, అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా భవన నిర్మాణాలు చేపట్టడం చేసే ఊరుకునే ప్రసక్తే లేదని మున్సిపల్‌ కమిషనర్‌ సుదర్శన్‌ హెచ్చరించారు. ఫుట్‌ పాత్‌లను ఆక్రమించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే సహించేదిలేదన్నారు. అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement