వికారాబాద్ పౌరసరఫరాల
సంస్థ స్పష్టీకరణ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిల అంశంపై ‘సాక్షి’ లో వసూళ్లు ‘కస్టమ్’ శీర్షికన శనివారం ప్రచురితమైన కథనానికి వికారాబాద్ జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఎస్.నరసింహ స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 50 మిల్లర్ల నుంచి రూ.102 కోట్ల బకా యిలు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.25 కోట్లు వసూలు చేసినట్లు ప్రకటించారు. మరో రూ.77 కోట్లు వసూలు కావాల్సి ఉందని పేర్కొ న్నారు. బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం మిల్లర్లకు ఇచ్చిన తుది గడువు సెప్టెంబర్ 31తో ముగిసిన నేపథ్యంలో ఆయా మిల్లర్లపై ఆర్‌ఆర్‌యాక్ట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమైనట్లు స్పష్టం చేశారు. రికవరీ యాక్ట్‌కు కూడా స్పందించని మిల్లర్ల విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మరింత కఠినంగా వ్యవహరించబోతున్నట్లు తెలిపారు.
నాణ్యమైన వైద్యసేవలు
అందించాలి
జిల్లా వైద్యాధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి
షాద్‌నగర్: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. కాంట్రాక్టు డేటా ఎంట్రీ ఆపరేటర్ విధులకు గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో సీసీ సురేష్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం
కొత్తూరు: ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని జిల్లా వైద్యాధికారి కళ్యాణ్ చక్రవర్తి సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన టీబీ ముక్త్‌భారత్ శిబిరాన్ని సందర్శించారు. ఇందులో భాగంగా టీబీ నిర్ధారణ పరీక్షలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టీబీని ప్రాథమిక దశలో గుర్తించి పూర్తిస్థాయి చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి దీప్తి, సిబ్బంది నగేష్, జ్యోతి, రవి తదితరులు పాల్గొన్నారు.


