ఎల్‌ఆర్‌ఎస్‌ అధికారి కనిపించడం లేదు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌ అధికారి కనిపించడం లేదు

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

● వెలసిన పోస్టర్లు

బడంగ్‌పేట్‌: టౌన్‌ ప్లానింగ్‌లోని రెవెన్యూ అధికారి పై పోస్టర్లు కలకలం రేపాయి. బడంగ్‌పేట సర్కిల్‌ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 56 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. 16 వేల మంది ప్రభుత్వానికి ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం చెల్లించారు. ఇప్పటి వరకు 9 వేల దరఖాస్తులు క్లియర్‌ చేశారు. లంచాలు ఇస్తేనే ఆర్‌ఐ అధికారి యాసిన్‌ క్లియర్‌ చేస్తున్నాడని బాధితులు ఆరోపించారు. ఈ క్రమంలో విసుగెత్తిన బాధితులు యాసిన్‌ కనిపించడంలేదంటూ పోస్టర్లు అంటించారు. దీనిపై డిప్యూటీ కమిషనర్‌ సమ్మయ్యను వివరణ కోరగా జోనల్‌ కమిషనర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. ఆర్‌ఐయాసిన్‌ను తొలగించి మరో అధికారిని నియమించాలని జెడ్సీని కోరామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement