రారండోయ్‌.. | - | Sakshi
Sakshi News home page

రారండోయ్‌..

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

పచ్చటి అందాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం కార్తీక మాసంవనభోజనాలకు ప్రత్యేకం సందడి చేసేందుకుసిద్ధమంటున్న కులసంఘాలు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: అటవీ శాఖ, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను అభివృద్ధి చేశారు. వీటిలో 47.03 లక్షల మొక్కలు నాటారు. మెజార్టీ పార్కులు ఓఆర్‌ఆర్‌కు ఆనుకుని, వెళ్లేందుకు అనువుగా ఉన్నాయి. అవసరమైన పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు స్థానిక జీవవైవిధ్యాన్ని కాపాడటం, ప్రజలకు వినోదం, పర్యావరణ అవగాహన కల్పించడం వీటి ప్రధాన ఉద్దేశం. వాకింగ్‌ ట్రాక్‌లు, సైక్లింగ్‌ మార్గాలు, వాచ్‌టవర్లు, సందర్శకులకు సదుపాయాలతో వీటి ని తీర్చిదిద్దారు. కార్తీక మాసంలో కుటుంబాలు, స్నేహితుల బృందాలు ప్రకృతి మధ్య సమయం గడిపేందుకు ఇవి ఆకర్షణీయంగా మారుతున్నాయి.

ప్రకృతి ‘సంజీవని’

గుర్రంగూడలోని సంజీవని వనం వనభోజన ప్రియులకు అనువైన ప్రకృతి విడిది కేంద్రాల్లో ఒకటి. పచ్చని చెట్లు, నడక మార్గాలు, సైక్లింగ్‌ సదుపాయాలు, విశాలమైన ప్రదేశాలు ఇక్కడి ప్రత్యేకత. ప్రకృతి మధ్య నడుస్తూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించొచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడంతో పాటు పిల్లలకు ప్రకృతిని పరిచయం చేయొచ్చు. పెద్ద బృందాలతోవనభోజనాలు నిర్వహించాలనుకునేవారు ముందుగా పార్కు సిబ్బందిని సంప్రదించి అనుమతులు, అందుబాటులో ఉన్న ఏర్పాట్లను తెలుసుకోవాల్సి ఉంటుంది.

‘లేక్‌వ్యూ’ అందాలు

గండిపేట చెరువు పరిసరాల్లోని లేక్‌వ్యూ పార్కు ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. విశాలమైన వాకింగ్‌ మార్గాలు, పిక్నిక్‌ స్పేస్‌లు, ఫ్లవర్‌ టెర్రస్‌లు, ఆర్ట్‌ పెవిలియన్లు, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ వంటి ఆకర్షణలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఒకవైపు పచ్చని చెట్లు.. మరోవైపు జలాశయం అందాలు.. ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో గడిపేందుకు అనువుగా ఉంటుంది. వారాంతాల్లో ఈ ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరుగుతోంది.

ఆకర్షణగా రాశివనం, నవగ్రహవనం

మహేశ్వరం, తుక్కుగూడ పరిసరాల్లోని సంజీవని, పంచవటి, మసీదుగడ్డ, శ్రీనగర్‌, సిరిగిరిపూర్‌ తదితర అర్బన్‌ ఫారెస్ట్‌ ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులకు ఆకర్షణగా ఉన్నాయి. పంచవటిలో రాశివనం, నవగ్రహ వనం ప్రత్యేకత కాగా..మసీదుగడ్డలో సైక్లింగ్‌, క్యాంప్‌ఫైర్‌ వంటి సదుపాయాలు కల్పించారు.

హరిన వనస్థలి నేషనల్‌ పార్క్‌లో విహారం

గుర్రంగూడలోని సంజీవని వనం

అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు రెడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement