చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

Oct 29 2026 8:24 AM | Updated on Oct 29 2026 8:24 AM

కొడంగల్‌ రూరల్‌: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌కుమార్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో 70వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం పొందవచ్చని తెలిపారు. నియోజకవర్గ విద్యార్థులు పోటీల్లో రాణించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఈ ప్రాంతానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంఈఓ రాంరెడ్డి, జిల్లాలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పీఈటీలు, పీడీలు, ఎన్‌సీసీ బృందం సభ్యులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ చైర్మన్‌ ప్రశాంత్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement