పోక్సో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

పోక్సో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష

Oct 29 2026 8:24 AM | Updated on Oct 29 2026 8:24 AM

● రూ.32 వేల జరిమానా

● తీర్పు వెల్లడించిన ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు

పహాడీషరీఫ్‌: పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి ఎల్బీనగర్‌ పోక్సో కేసుల విచారణ ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు బుధవారం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇన్‌స్పెక్టర్‌ బి.లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం దయ్యాలగూడెం తండాకు చెందిన జర్పుల గణేశ్‌ (25) ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తైపె కన్నేసి పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఎవరికై నా చెబితే తల్లికి సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియా లో వైరల్‌ చేస్తానని బెదిరించేవాడు. ఈ క్రమంలోనే 2024 అక్టోబర్‌ 29న బాలికను బలవంతంగా మామి డిపల్లిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి పరారయ్యాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష, రూ.32 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.1.50 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement