గుర్తుతెలియని మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Aug 27 2026 7:20 AM | Updated on Aug 27 2026 7:20 AM

రాజేంద్రనగర్‌: అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సీతయ్య తెలిపిన వివరాల ప్రకారం... అత్తాపూర్‌ పిల్లర్‌ నం.141 వద్ద గుర్తు తెలియని వ్యక్తి (50) అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టు బుధవారం పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. మృతుడు అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement