నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు

Aug 27 2026 7:20 AM | Updated on Aug 27 2026 7:20 AM

మొయినాబాద్‌/ఇబ్రహీంపట్నం: ఈ నెల 30 జరుగనున్న నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష కోసం ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పోలీస్‌ అధికారులు పరిశీలించారు. బుధవారం మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, వీజేఐటీ ఇంజనీరింగ్‌ కళాశాల, చైతన్య డీమ్డ్‌ టూబీ యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను చేవెళ్ల ఏసీపీ కిషన్‌, మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకన్న.. ఇబ్రహీంపట్నం డివిజన్‌ పరిధి శేరిగూడలో ఉన్న శ్రీచక్ర కళాశాల (టీసీఎస్‌ అయాన్‌ డిజిటల్‌) సెంటర్‌ణు ఏసీపీ కేవీపీ రాజు, ఎస్‌హెచ్‌ఓ మహేందర్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ జితేందర్‌రెడ్డి, ఎస్‌ఐ రామకృష్ణ తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో సీసీటీవీ కెమరాల పనితీరు, పార్కింగ్‌ ఏర్పాట్లు, ప్రవేశం, నిష్క్రమణకు సరైన దారులు, ఇతర భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఏసీపీ కిషన్‌ తెలిపారు.

చేవెళ్ల, ఇబ్రహీంపట్నం ఏసీపీలు

కిషన్‌, కేవీపీ రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement