కొత్తూరు: గుర్తు తెలియని దుండగులు ఆలయంలో హుండీలు ధ్వంసం చేసి కానుకలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్‌లోని వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఆలయ పూజారి రాజశేఖర్ తెలిపిన ప్రకారం.. రోజు మాదిరిగానే ఉదయం ఆలయానికి రాగానే హుండీలు ధ్వంసం చేసినట్లు గుర్తించి పోలీసులకు, స్థానికులకు సమాచారం ఇచ్చానన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
అప్పుల బాధతో రియల్టర్ అదృశ్యం
శంషాబాద్‌రూరల్: అప్పుల బాధతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దషాపూర్ వాసి గుల్ల నవీన్(29) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇదే గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు జ్యోతి, అనురాధ కలిసి నవీన్‌కు కొంత డబ్బు అప్పుగా ఇచ్చారు. వారి బంగారు నగలను తాకట్టు పెట్టి కూడా డబ్బు సమకూర్చారు. ఈ క్రమంలో వ్యాపారంలో నవీన్ నష్టపోయాడు. దీంతో తాను తీసుకున్న అప్పును వీరికి తిరిగి ఇవ్వలేకపోయాడు. కొంత కాలంగా అక్కాచెల్లెళ్ల నుంచి నవీన్‌కు డబ్బుల విషయంలో ఒత్తిడి పెరిగింది. ఇదిలా ఉండగా.. నవీన్ సోదరి రవళి కొంత డబ్బు సమకూర్చి తాకట్టులో ఉన్న నగలను విడిపించడంతో పాటు కొంత అప్పును తీర్చారు. అయినా మిగతా డబ్బుల కోసం నవీన్‌పై ఒత్తిడి రావడంతో అప్పు తీర్చే మార్గం లేక మనోవేధనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 25న సాయంత్రం తన ఫోన్‌ను ఇంట్లో వదిలి పని మీద బయటకు వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరాడు. రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో అతడి కోసం అన్ని చోట్ల వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తల్వార్‌తో బార్ సిబ్బందిపై దాడి
మణికొండ: సమయం మించిపోయింది మందు తాగేందుకు అవకాశం లేదని చెప్పిన బార్ సిబ్బందిపై తల్వార్‌తో దాడి చేసిన సంఘటన నార్సింగి ఠాణా పరిధిలోని పుప్పాలగూడలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. పైప్‌లైన్ రోడ్డు లాలమ్మ గార్డన్‌లోని ‘తాగేసిపో.. బార్’కు రాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చా రు. బీర్ కావాలని అడగటంతో సమయం మించిపోయిందని.. కూర్చునేందుకు అవకాశం లే దని.. కావాలంటే తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన వారు మరో వ్యక్తికి ఫోన్ చేసి అక్కడకు రమ్మన్నారు. అతడు తల్వార్‌తో వచ్చి తన ముగ్గురు మిత్రులతో కలిసి బార్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో శ్రావణ్, మహే ష్‌కు గాయాలయ్యాయి. ఆ తర్వాత నిందుతు లు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని నిందితులను పట్టుకుంటామన్నారు.


