పేకాట స్థావరంపై దాడి | - | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై దాడి

Aug 27 2026 7:20 AM | Updated on Aug 27 2026 7:20 AM

ఉల్లి రైతులకు తీపికబురు

ఎనిమిది మంది అరెస్ట్‌

కొందుర్గు: పేకాట స్థావరంపై దాడిచేసిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన మండల పరిధిలోని మట్పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామ శివారులోని శ్రీనివాస్‌రెడ్డికి చెందిన వ్యవసాయ పొలంలో పేకాడుతున్నట్లు బుధవారం విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు షాద్‌నగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు, కొందుర్గు పోలీసులు దాడి చేసి ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకున్నవారు. వారి వద్ద నుంచి రూ.29,900 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఓ బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

మట్టి తవ్వకాలు చేపట్టిన వారిపై కేసు

ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన బుధవారం సీతా రాంపేట గ్రామ రెవెన్యూ పరిధిలో చోటు చేసుకుంది. ఇబ్రహీపంట్నం సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. అక్రమంగా మట్టి తవ్వ కా లు చేపడుతున్నట్లు సమాచారం అందడంతో ఇబ్రహీంపట్నం రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేపట్టారు. ఓ ఇటాచీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదచేశామన్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వినా, తరలించినా క్రిమి నల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఎకరాకు రూ.8 వేల సబ్సిడీ

బంట్వారం: ఉల్లి పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.8 వేలు చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నట్లు హార్టికల్చర్‌ ఆఫీసర్‌ కమల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఉల్లి సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. నీటి సౌకర్యం ఉండి, ఎర్ర, ఇసుక నేలలు అనుకూలమన్నారు. ఆసక్తి గల రైతులు పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌, పాస్‌ ఫొటోతో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్‌ నంబర్‌ 8977714195లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement