షాద్‌నగర్‌రూరల్: దేవస్థానాల దర్శనంకోసం ఒకరోజు దర్శనయాత్రకు ఆర్టీసీ డీలక్స్ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తోందని షాద్‌నగర్ డిపో మేనేజర్ కరుణశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 8న (శనివారం) అమరావతి, మంగళగిరి, విజయవాడలోని దైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు డీలక్స్ బస్సు ఏర్పా టు చేసినట్టు తెలిపారు. తెల్లవారుజామున 4గంటలకు షాద్‌నగర్ డిపో నుంచి బయలుదే రి అదేరోజు రాత్రి షాద్‌నగర్‌కు చేరుకుంటుందని చెప్పారు. ఈ యాత్రకు ఒకరికి రూ.1,100 టికెట్ ధర నిర్ణయించినట్టు వెల్లడించారు. అల్పాహారం, భోజనంకోసం ఎవరి ఖర్చులు వారే భరించుకోవాలన్నారు. టికెట్ బుకింగ్ కో సం 91826 45281, 94900 21433, 73828 28662, 99592 26287, 94911 66785 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఓపెన్‌వర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Aug 5 2026 8:39 AM | Updated on Aug 5 2026 8:39 AM
ఓపెన్‌వర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలోని డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రం–172లో డిగ్రీ, పీజీ విద్యనభ్యసించేందుకు ఈనెల 7 వరకు ప్రవేశాలకు గడువు ఉన్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాధిక మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉన్నత విద్య కొనసాగించాలని ఆశించే విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, ఇతర ఆసక్తిగల అభ్యర్థులు తమ కెరీర్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా దూర విద్య ద్వారా డిగ్రీలు పొందే అవకాశం ఉందని తెలిపారు. ఇందులో చదివిన కోర్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పదో తరగతి, ఇంటర్ మెమో, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వివరాలకు 73829 29772 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
టెట్ మెటీరియల్ ఆవిష్కరణ
ఇబ్రహీంపట్నం: టెట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావడానికి స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ (ఎస్టీయూటీఎస్) ఆధ్వర్యంలో రూపొందించిన మెటీరియల్‌ను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెట్ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి ఉపయోగపడే నాణ్యమైన మెటీరియల్‌ను రూపొందించిన ఎస్టీయూ నేతలను అభినందించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్టపాక ప్రవీణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి సత్తు పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల పెంపు, పోటీ పరీక్షల్లో విజయమే లక్ష్యంగా అనుభవజ్ఞులైన నిపుణులతో మెటీరియల్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ మెటీరియల్ ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు భాస్కర్‌నాయక్, మ హేశ్, శ్రీనివాస్‌నాయక్, పాండు పాల్గొన్నారు.
8న దైవ క్షేత్రాల దర్శనయాత్రకు ప్రత్యేక బస్సు
Advertisement


