బడి బస్సులు ఫంక్షన్లకు ఇవ్వొద్దు.. మా పొట్ట కొట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

బడి బస్సులు ఫంక్షన్లకు ఇవ్వొద్దు.. మా పొట్ట కొట్టొద్దు

Aug 5 2026 8:39 AM | Updated on Aug 5 2026 8:39 AM

చేవెళ్ల: పాఠశాలల బస్సులను ఫంక్షన్లు, మ్యారేజీలకు పంపకూడదని తెలంగాణ టూరిస్ట్‌ అండ్‌ ట్రావెల్స్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు పి. సురేశ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలకు మంగళవారం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టూరిస్ట్‌ అండ్‌ ట్రావెల్స్‌ సంఘం ఏర్పాటు చేసుకొని ట్రావెల్స్‌ వాహనాలను నడిపించుకుంటూ ఉపాధి పొందుతున్న యజమానులు, డ్రైవర్లు ప్రైవేటు పాఠశాలల బస్సులు ఫంక్షన్లకు పంపడం ద్వారా ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టూరిస్ట్‌ ట్రావెల్స్‌నే నమ్ముకొని జీవిస్తున్న తమకు అన్యాయం చేయొద్దన్నారు. ఈనెల 18న చేవెళ్లలో జిల్లా స్థాయిలో తెలంగాణ టూరిస్ట్‌ అండ్‌ ట్రావెల్స్‌ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి ట్రాన్స్‌పోర్టు ఉన్నతాధికారులను సైతం ఆహ్వా నిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రావెల్స్‌ కమిటీ మండల సభ్యులు గోవర్దన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సత్తిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ, బల్వంత్‌, విజయ్‌, వెంకటేశ్‌, రవీందర్‌, బల్వంత్‌యాదవ్‌, డి.శ్రీనివాస్‌రెడ్డి, బస్సు ఓనర్స్‌, డ్రైవర్లు పాల్గొన్నారు.

టూరిస్ట్‌, ట్రావెల్స్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు సురేశ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement