నేత్రం | - | Sakshi
Sakshi News home page

నేత్రం

Apr 11 2026 9:46 AM | Updated on Apr 11 2026 9:46 AM

షీడెన్‌పై నేత్రం

రహస్య కెమెరాలపై నగర పోలీసుల దృష్టి

కెమెరాలు లభిస్తే సంస్థల పైనా కేసులు

షీడెన్‌పై

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని వస్త్ర దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, ఆస్పత్రులు, హోటళ్లు.. ఇటీవల కాలంలో ఇలా ఎక్కడ చూసినా హిడెన్‌ కెమెరాల ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళల ఆత్మగౌరవానికి, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఈ రహస్య కెమెరాల గుట్టు రట్టు చేసేందుకు హైదరాబాద్‌ పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య ప్రాంతాలతో పాటు హాస్టళ్లు, విద్యా సంస్థల్లో హిడెన్‌ కెమెరాల ముప్పును తప్పించేందుకు ‘షీ నేత్ర’ పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని ఓల్డ్‌ కమిషనరేట్‌లో కొత్వాల్‌ విశ్వనాథ్‌ చన్నప్ప సజ్జనర్‌ వీటిని ఆవిష్కరించారు. అదనపు సీపీ (నేరాలు) ఎం.శ్రీనివాసులతో కలిసి బృందాలకు కెమెరా డిటెక్టర్లు అందించారు. తొలి దశలో కమిషనరేట్‌లోని ఏడు జోన్లలో ఒక్కోటి చొప్పున షీ నేత్ర టీమ్స్‌ పని చేయనున్నాయి. వీటికి డిటెక్టర్ల వినియోగం, తనిఖీల సమయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాటించాల్సిన నిబంధనల స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌పై (ఎస్‌ఓపీ) రెండు దశల్లో సమగ్ర శిక్షణ ఇచ్చారు.

జోన్ల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు

ప్రతి టీమ్‌కు అత్యాధునిక డిటెక్టర్ల అందజేత

కీలక ప్రాంతాల్లో వీరికి తనిఖీలు చేసే బాధ్యత

తమ ప్రాంగణాల్లోని ప్రైవేటు ప్రదేశాల్లో రహస్య కెమెరాలు లేవని నిర్ధారించుకోవాల్సిన పూర్తి బాధ్యత ఆయా యాజమాన్యాలదే. ఎవరైనా అజాగ్రత్తగా ఉన్నా, కెమెరాలు లభ్యమైనా సంబంధిత యాజమాన్యాలపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. అవసరమైతే ఆయా సంస్థలను, బాధ్యులైన ఉద్యోగులను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతాం. ప్రతి సంస్థ తప్పనిసరిగా ’కస్టమర్‌ సేఫ్టీ ఇన్‌చార్జీ’ని నియమించుకోవాలి. వీరు షీ–టీమ్స్‌కు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించాలి. వీరికి పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తాం. కెమెరా డిటెక్టర్లను యాజమాన్యం సమకూర్చుకోవాలి. ఎక్కడైనా కెమెరా లేదా అనుమానాస్పద వస్తువును గుర్తిస్తే వెంటనే ‘100/112’కు లేదా 94906 16555కు సమాచారం అందించాలి. డిటెక్టర్లు రహస్య కెమెరాలు, స్పై కెమెరాలు, సెల్‌ఫోన్‌ కెమెరాలను పసిగట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. – వీసీ సజ్జనర్‌, సిటీ కొత్వాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement