హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి

Apr 11 2026 9:46 AM | Updated on Apr 11 2026 9:46 AM

షాబాద్‌: హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని జాతీయ సాహిత్య పరిషత్‌ ప్రాంత సంఘటన మంత్రి భాస్కరయోగి అన్నారు. మండల పరిధిలోని సర్ధార్‌నగర్‌ శివాలయంలో శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గ హిందూ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన శంకరస్వామీజీతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు హిందూ మత మూలాలు తెలుసుకోవాలన్నారు. హిందూ మత గొప్పదనం తెలిపేందుకే ఈ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఘనతను వివరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు శంకర్‌రావు జాదవ్‌, ఉపాధ్యక్షుడు రాంచంద్రయ్య, కార్యదర్శి ఆంజనేయులు, గూడెం రమేశ్‌, మల్లేశ్‌, ప్రవీణ్‌, శ్రీధర్‌రెడ్డి, మురళి, శ్రీధర్‌, నరేశ్‌, విష్ణు, సూర్య, ప్రకాశ్‌, రాజు, నవీన్‌, మహేశ్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, హిందూ బంధువులు తదితరులున్నారు.

జాతీయ సాహిత్య పరిషత్‌ ప్రాంత సంఘటన మంత్రి భాస్కరయోగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement