బడంగ్‌పేట్: సర్కిల్–16, బాలాపూర్ 62వ డివిజన్‌లోని గ్రీన్ సీటీ ఫేస్–3లో తాగునీటి సరఫరా సరిగా కావడం లేదని శుక్రవారం వాటర్ వర్క్స్ అధికారులకు కాలనీవాసులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రేణుకాపూర్ పరిధిలోని గ్రీన్ సిటీ ఫేస్–3 కాలనీలో నాలుగు రోజులకు ఒకసారి 15 నిమిషాలు మాత్రమే తాగునీరు వస్తున్నాయని వాపోయారు. రోజు తప్పించి రోజు అరగంట పాటు నీటి సరఫరా చేసి తాగునీటి ఎద్దడి తీర్చాలని ఎంఈ సాయిపండుకు విన్నవించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ త్వరలో సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో కాలనీ అధ్యక్షుడు సయ్యద్ అబిద్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి ముజీబ్‌ఖాన్, వర్కింగ్ ఇన్స్‌పెక్టర్ జగన్, లైన్‌మెన్ అజాజ్ హుస్సేన్ కాలనీవాసులు ఉన్నారు.


