మార్కెటింగ్‌పై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

మార్కెటింగ్‌పై అవగాహన అవసరం

Apr 11 2026 9:46 AM | Updated on Apr 11 2026 9:46 AM

మంచాల: విద్యార్థులకు మార్కెటింగ్‌పై అవగాహన తప్పనిసరి అని ఆరుట్ల మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సుప్రియ అన్నారు. స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న 15 మంది విద్యార్థులకు వృత్తి విద్య శిక్షణలో భాగంగా శుక్రవారం మార్కెంటింగ్‌పై అవగాహన కల్పించారు. 10 రోజుల పాటు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్‌ బట్టల దుకాణంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే చదువుతో పాటు చేతి వృత్తులపై అవగాహన కల్పించాలన్నారు. మార్కెంటింగ్‌పై అవగాహన ఉంటే భవిష్యత్‌లో స్వయం ఉపాధి రంగంలో రాణించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వృత్తి విద్య ఉపాధ్యాయుడు రాజవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆరుట్ల మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సుప్రియ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement