పది ఇసుక ట్రాక్టర్ల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

పది ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

Sep 11 2026 8:10 AM | Updated on Sep 11 2026 8:10 AM

పది ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

టీడీపీ నాయకుడికి చెందినవిగా సమాచారం.?

నాగులుప్పలపాడు: మండలంలోని గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10 ట్రాక్టర్లను ఎస్సై బీబీ మహేంద్ర గురువారం తన సిబ్బందితో దాడి చేసి పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. వాటిని నాగులుప్పలపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. టీడీపీకి చెందిన ఒక నాయకుడు అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు సమాచారం కాగా, ఒంగోలు రూరల్‌ సీఐ ఆధ్వర్యంలో ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement