సంఘటన స్థలంలో మృతి చెందిన ఉమాశంకర్, చికిత్స పొందుతూ మృతి చెందిన లక్ష్మణ్
వలేటివారిపాలెం: అయ్యవారిపల్లి–మాలకొండ మధ్య జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై మాలకొండ వైపు వెళ్తున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో గాయపడిన వ్యక్తిని కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందినట్లు సమాచారం. ఎస్సై ప్రేమ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల వివరాలు, ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మరో ఇద్దరు కూడా..
జరుగుమల్లి (సింగరాయకొండ): మోటారు సైకిల్‌పై అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి రోడ్డు మార్జిన్ గుంతలో పడి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన జరుగుమల్లి మండలం వావిలేటిపాడు సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..ఒడిశా రాష్ట్రానికి చెందిన మక్బూల్ ఆలీ, హుస్సేన్‌లు మున్నంగి సీ ఫుడ్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరు నమాజు చేసుకునేందుకు ఫ్యాక్టరీ నుంచి టంగుటూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మక్బూల్ ఆలీ (22) సంఘటన స్థలంలోనే మృతి చెందగా తీవ్ర గాయాలపాలైన హుస్సేన్ (22)ను 108లో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై భాగ్యరాజ్ తెలిపారు.
జిల్లాలో శుక్రవారం రాత్రి వేర్వేరు చోట్ల జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి దుర్మరణం చెందారు. ఒక సంఘటన జరుగుమల్లి మండలం వావిలేటిపాడు వద్ద జరగగా మరో సంఘటన వలేటివారిపాలెం
మండలం అయ్యవారిపల్లి–మాలకొండ మధ్య జరిగింది.


