క్రీడా పతకాలు సాధించిన వారికి ఎస్పీ అభినందన | - | Sakshi
Sakshi News home page

క్రీడా పతకాలు సాధించిన వారికి ఎస్పీ అభినందన

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

వివిధ విభాగాల్లో 42 పతకాలు సాధించిన ప్రకాశం జిల్లా పోలీసులు

ఒంగోలు సిటీ: రాష్ట్ర పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి 4 వరకు జరిగిన 1వ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌–2026 పోటీల్లో గుంటూరు రేంజ్‌ తరఫున పాల్గొన్న ప్రకాశం జిల్లా పోలీస్‌ సిబ్బంది మొత్తం 42 పతకాలు సాధించిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్థన్‌రాజు సోమవారం ప్రత్యేకంగా అభినందించి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్థన్‌రాజు మాట్లాడుతూ జిల్లా పోలీస్‌ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 42 పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. ఇందులో 13 బంగారు పతకాలు, 16 వెండి పతకాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్‌లో నిర్వహించే మరిన్ని క్రీడా పోటీల్లో ఇదే స్ఫూర్తితో రాణించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

వివిధ క్రీడా విభాగాల్లో

పతకాలు సాధించిన విజేతలు

ఎస్‌.వి.రమణారెడ్డి (ఆర్‌ఐ)–లాన్‌ టెన్నిస్‌ డబుల్స్‌ (ఎన్‌జీవో)లో వెండి పతకం సాధించారు. వి.సురేష్‌ బాబు 100 మీటర్ల పరుగులో బంగారు, 200 మీటర్ల పరుగులో బంగారు, కబడ్డీలో వెండి పతకం సాధించారు. సీహెచ్‌.శివ సుబ్రహ్మణ్యం–కంప్యూటర్‌ అవేర్‌నెస్‌లో వెండి, పీపీటీలో కాంస్య, ఆఫీస్‌ ఆటోమేషన్‌ లో కాంస్య పతకాలు సాధించారు. రాజగోపాల్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో బంగారు పతకం సాధించారు. వరలక్ష్మి ఆర్మ్‌ రెజ్లింగ్‌, పెన్కాక్‌ సిలాట్‌లో బంగారు పతకాలు, కబడ్డీలో వెండి, ఫెన్సింగ్‌, కాంస్య పతకాలు సాధించారు. రాజశేఖర్‌ వుషు, ఫెన్సింగ్‌ లో బంగారు పతకాలు, తైక్వాండో, పెన్కాక్‌ సిలాట్‌, కరాటే లో వెండి పతకాలు సాధించారు. శ్రీనివాసులు పవర్‌ లిఫ్టింగ్‌లో వెండి, వెయిట్‌ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. రత్నంబాబు తైక్వాండో, పెన్కాక్‌ సిలాట్‌, వుషులో బంగారు పతకాలు, కరాటేలో వెండి పతకం సాధించారు. కరీముల్లా వుషు, పెన్కాక్‌ సిలాట్‌లో బంగారు పతకాలు, తైక్వాండో, కరాటే లో వెండి పతకాలు, హ్యాండ్‌బాల్‌లో కాంస్య పతకం సాధించారు. స్పర్జన్‌రాజు తైక్వాండో, పెన్కాక్‌ సిలాట్‌ లో వెండి పతకాలు, కరాటే లో కాంస్య పతకం సాధించారు. శ్రీలక్ష్మి వెయిట్‌ లిఫ్టింగ్‌లో బంగారు, పవర్‌ లిఫ్టింగ్‌లో కాంస్య, కబడ్డీలో వెండి పతకం సాధించారు. వెంకటేష్‌, గిరిబాబు కబడ్డీలో వెండి పతకం సాధించారు. కోటేశ్వరరావు హ్యాండ్‌బాల్‌లో కాంస్య పతకం సాధించారు. సుధాకర్‌, యస్దాని, వెంకటరావు, శుభాన్‌ రెడ్డి హ్యాండ్‌బాల్‌లో కాంస్య పతకం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement