ఆటోను ఢీకొన్న టూరిస్టు బస్సు | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న టూరిస్టు బస్సు

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

ఆటోను ఢీకొన్న టూరిస్టు బస్సు

పెద్దదోర్నాల: వేగంగా వచ్చిన ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటన మండల కేంద్రానికి సమీపంలోని బైపాస్‌రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఎగువ చర్లోపల్లికి చెందిన పలువురు మహిళలు ఓ ఆటోలో బమ్మిదోర్నాలలో జరిగే పెళ్లికి ఆటోలో బయలుదేరారు. వారి ఆటో బైపాస్‌రోడ్డులోకి ప్రవేశించగానే ఎదురుగా వస్తున్న టూరిస్టు బస్సు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న పులివేముల పెద్ద మరియమ్మ, పులివేముల చిన్న మరియమ్మ, పులవేముల నవమ్మ, పులివేముల ఎస్తేరులకు తీవ్ర గాయాలవగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. 108లో క్షతగాత్రులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై వెంకట రమణయ్య వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వివరాలడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులను వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ గంటా రమణారెడ్డి, నాయకులు అల్లు రాంభూపాల్‌రెడ్డి వైద్యశాలకు చేరుకుని పరామర్శించారు.

నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు

పరామర్శించిన వైఎస్సార్‌ సీపీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement