గల్లంతైన యువకుల కోసం గాలింపు | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన యువకుల కోసం గాలింపు

Sep 7 2026 12:21 AM | Updated on Sep 7 2026 12:21 AM

పెద్దదోర్నాల: ఈతకు వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుల ఆచూకీ ఆదివారం అర్ధరాత్రి వరకు లభ్యం కాలేదు. ఆదివారం 4.30 గంటల సమయంలో వినయ్‌కుమార్‌ మృతదేహం ఒక్కసారిగా కనిపించి మరలా మునిగి పోయినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో ఇద్దరి ఆచూకీ కోసం పలువురు అధికారులు, పోలీసు సిబ్బంది అడుగడునా జల్లెడ పట్టినా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. శనివారం 12 గంటల సమయంలో ఈత కోసం స్నేహితులతో కలిసి ఫీడర్‌ కెనాల్‌ వద్దకు వెళ్లిన కటకానిపల్లెకు కాబోయే వరుడు రాజ్‌కుమార్‌, అతని సోదరుడు వినయ్‌కుమార్‌లు ఫీడర్‌ కెనాల్‌లో గల్లంతైన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టి పూర్తిగా చీకటి పడటంతో ఫలితం లేక గాలింపు చర్యలను నిలిపివేఽశారు. ఈ నేపథ్యంలో చేసేదేమి లేకపోవడంతో ఆదివారం ఉదయం నుంచి ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు తొలుత యువకులు ఈతకు దిగి గల్లంతైన 17.7 కిలోమీటర్‌ వద్ద ర్యాంపు నుంచి నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌ వరకు ఇన్‌ప్లేటబుల్‌ మోటార్‌ రెస్క్యూ బోటు ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన యువకుల అచూకీ కోసం కటకానిపల్లె గ్రామస్తులు ఉదయం నుంచి మండుటెండలో పడిగాపులు కాశారు. ఈ క్రమంలో వినయ్‌కుమార్‌ మృతదేహం కనిపించి జరిపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో యువకుల ఆచూకీ తెలియకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడి ఓ ఇంటి వాడుగా ఉండాలని కోరుకున్న రాజ్‌కుమార్‌ తల్లిదండ్రులు పెద్దఅవులయ్య, జానీలు పెండ్లికి ఓ రోజు ముందే తమ కుమారుడు నీటిలో గల్లంతు కావడాన్ని జీర్జించుకోలేకపోయారు. దీంతో పాటు తండ్రి లేకపోయినా కుటుంబాన్ని ఒంటి చేత్తో పోషిస్తున్న వినయ్‌కుమార్‌ అచూకీ లభించకపోవడంతో తల్లి రాములమ్మలు తమ కుమారుల ఆచూకీ కోసం రాత్రంతా ఫీడర్‌ కెనాల్‌ సమీపంలోనే పడిగాపులు కాయటం గ్రామస్తులను కలిచివేసింది.

రెస్క్యూ బోటుతో రంగంలోకి దిగిన

ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందం

గల్లంతైన ప్రాంతం నుంచి నల్లమల సాగర్‌ వరకు గాలింపు

కనిపించినట్లు కనిపించి జారిపోయిన

వినయ్‌ మృతదేహం

ఆదివారం అర్ధరాత్రి వరకు లభ్యం కాని

యువకుల ఆచూకీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement