గుక్కెడు నీరు రాదు | - | Sakshi
Sakshi News home page

గుక్కెడు నీరు రాదు

Sep 7 2026 12:21 AM | Updated on Sep 7 2026 12:21 AM

ఒంగోలు: ‘‘మా ఊర్లను ఖాళీ చేసి.. ప్రాజెక్టు కోసం త్యాగం చేశాం. ఇతరులకు నీళ్లు అందించే ప్రాజెక్టు కోసం మా ఇళ్లను, భూములను వదిలాం. ఇప్పుడు మా కుటుంబాలకు తాగునీరు కూడా దొరకని పరిస్థితి వచ్చింది’’ అంటూ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు వాపోతున్నారు. ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు త్యాగం చేసిన త్యాగధనులకు బహుమానంగా ప్రభుత్వం చివరకు వారికి అవమానాన్నే మిగిల్చింది. ప్రస్తుతం నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా మారింది. రెండేళ్ల కిందటే ప్రాజెక్టు పూర్తయినా, క్రెడిట్‌ వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తుందని ప్రభుత్వం జాప్యం చేసింది. వీరికి ఏడాదో, ఆరు నెలల ముందే పరిహారం ఇచ్చి ఉంటే, పునరావాస కాలనీల్లో ఇళ్లు నిర్మించుకొని ఉండేవారు. కాలనీల్లో మౌలిక వసతులు సమకూరేవి. అయితే నీటి విడుదలకు ముందు పరిహారం ఇవ్వటంతో కొంత మందికి గూడు దొరక్క అల్లాడిపోతున్నారు. టెంట్లలో తలదాచుకొంటున్నారు. కొంత మందికి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం, అప్పులకు సరిపోవటంతో, చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడిపోతున్నారు. ముంపు గ్రామాల్లో రైతులకు ఎప్పుడో ఇచ్చిన పరిహారం కర్పూరంలా కరిగిపోయింది. అయినా వారు ఆ భూములనే నమ్ముకొని ఇంత కాలం వ్యవసాయం చేసుకొంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చారు. ఈ ఏడాది కూడా పంటలు సాగు చేశారు. ప్రస్తుతం పెట్టిన పెట్టుబడి నీటి పాలైంది. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కొంత మంది రైతులకు అప్పులకు సరిపోయింది. దీంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పది మందికి పట్టెడన్నం పెట్టిన అన్నదాతలు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో దారి తెన్నూ కానరాక అల్లాడిపోతున్నారు. ఇంతగా రైతులు, ముంపు గ్రామాల నిర్వాసితులను ఇబ్బంది పెట్టి ఖాళీ చేయించినా సాగుకు మాత్రం నీరు ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రాజెక్టుకు మేమే శంకుస్థాపన చేశాం, మేం ప్రారంభిస్తున్నామని డప్పుకొట్టుకోవటం, క్రెడిట్‌ చోరీ కోసం తప్ప రైతులకు కూడా ఉపయోగం కనిపించటం లేదు.

నిర్వాసితులకు అన్నీ కష్టాలే పట్టాలు లేవు..ఇచ్చిన కాలనీలో కనీస వసతులు లేవు అద్దె ఇళ్లకు రెట్టింపైన భారం పునరావాస కాలనీల్లో తాగునీటికీ కటకట బడికెళ్లాలంటే 7 కి.మీ, రేషన్‌ కోసం 15 కి.మీ ప్రయాణం

నిలువ నీడ లేదు..

లక్షలాది మంది ప్రజల బాగుకోసం తమ సర్వస్వాన్నీ త్యాగం చేసిన వారి

జీవితాలు అంధకారంలో

మగ్గుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు

పునరావాస కాలనీల్లో కనీస వసతులకు నోచుకోక గుక్కెడు నీటి కోసం కూడా నిర్వాసితులు అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది. అద్దె ఇళ్ల భారం

భరించలేక రోడ్డు పక్కనో, చెట్టు నీడనో.. పరదాల మాటునో తలదాచుకోవాల్సి వస్తోంది. ఉపాధి, పిల్లల చదువులు, నిత్యావసరాల కోసం సుదూర

ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని

నిర్వాసితులు వాపోతున్నారు.

సాక్షి ప్రతినిధి,

పునరావాస కాలనీల్లో

అన్నీ కష్టాలే...

ప్రాజెక్టు కోసం ఉన్న ఊర్లను, ఇళ్లను, భూములను వదిలి పునరావాస కాలనీలకు చేరుకున్నా.. అక్కడ కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇళ్ల పట్టాలు అందకపోవడం.. మరోవైపు తాగునీరు, రేషన్‌ వంటి కనీస అవసరాల కోసం అవస్థలు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. పునరావాస ప్రాంతానికి వచ్చినా రేషన్‌ బియ్యం కోసం తమ పాత ప్రాంతాల నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న కాలనీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిర్వాసితులు చెబుతున్నారు. ఉపాధి, పిల్లల చదువులు, నిత్యావసరాల కోసం ఒకచోట.. రేషన్‌ కోసం మరోచోట తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. వెలిగొండ నిర్వాసితుల కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని బాధితులు చెబుతున్నారు. కనీసం తాగేందుకు, వంట చేసుకునేందుకు నీరు కూడా సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. పాత గ్రామాల్లో ఇతరులకు నీళ్లు అందించిన తామే.. ఇప్పుడు తమ కుటుంబాలకు తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్నారులతో

దిక్కుతోచని పరిస్థితి

చిన్నపిల్లలను వెంట పెట్టుకుని కొత్త కాలనీలకు వచ్చిన తమకు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియడం లేదని నిర్వాసితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సొంత ఇల్లు లేదు.. పట్టాలు లేవు.. నీళ్లు లేవు.. కనీస సౌకర్యాలు లేవు.. ఈ పరిస్థితుల్లో పిల్లలను పెట్టుకుని ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాలనీలో నీళ్లు లేక రోడ్డు పైకి వచ్చి మోసుకెళ్తున్న నిర్వాసితులు

ఇళ్లను ఖాళీ చేసి కాలనీకి వచ్చిన నిర్వాసితుల కుటుంబం

ఇళ్లు లేక రోడ్డు పక్క వేసిన రేకులు

దూరంగా ఉన్న రేషన్‌ దుకాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement