జిల్లా మోడరన్‌ కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షునిగా శంకర్రావు | - | Sakshi
Sakshi News home page

జిల్లా మోడరన్‌ కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షునిగా శంకర్రావు

Sep 7 2026 12:15 AM | Updated on Sep 7 2026 12:15 AM

జిల్లా మోడరన్‌ కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షునిగా శంకర్రావు అంతర్‌ జిల్లాల పురుషుల బ్యాడ్మింటన్‌ విజేత ప్రకాశం విద్యార్థులకు ఆధార్‌ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ మార్కాపురం జిల్లా లాన్‌ టెన్నిస్‌ కార్యవర్గం ఎన్నిక

సింగరాయకొండ: ప్రకాశం జిల్లా మోడరన్‌ కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షునిగా రిటైర్డ్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ కందికట్టు శంకర్రావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మండల కేంద్రంలోని అసోసియేషన్‌ కార్యాలయంలో ఆదివారం అసోసియేషన్‌ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్‌ గౌరవ చైర్మన్‌గా డాక్టర్‌ మలినేని పెరుమాళ్లు, ఉపాధ్యక్షులుగా ప్రత్తిపాటి వెంకటేశ్వర్లు, ఓగుబోయిన శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా తేళ్ల వంశీకృష్ణ, సంయుక్త కార్యదర్శులుగా ఆనాల రవీంద్ర, ఎన్‌టీ ప్రసాద్‌, కోశాధికారిగా టీ శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

అల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ 12వ సీనియర్‌ సీ్త్ర, పురుషుల అంతర్‌ జిల్లాల బాల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌–2026 పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఏఏపీ అనుబంధం), నెల్లూరు జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ సంయుక్త నిర్వహణలో అల్లూరులోని రామకృష్ణ జూనియర్‌– డిగ్రీ కళాశాలల వేదికగా మూడు రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు ట్రోఫీలు, జ్ఞాపికలు, అవార్డులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రదానం చేశారు. పురుషుల విభాగంలో విన్నర్స్‌గా ప్రకాశం, రన్నరప్‌గా విశాఖపట్నం, మహిళల విభాగంలో విన్నర్స్‌గా విశాఖపట్నం, రన్నరప్‌గా గుంటూరు నిలిచాయి.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 39,338 మందికి ఆధార్‌ అప్‌డేట్‌

ఒంగోలు సబర్బన్‌: ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా విద్యార్థులకు ఆధార్‌ అప్‌డేట్‌ చేసే కార్యక్రమాన్ని చేపట్టామని స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ ముప్పూరి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఉమ్మడి జిల్లాలో 39,338 మంది విద్యార్థులకు ఆధార్‌ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేయనున్నామన్నారు. 15–17 సంవత్సరాల వయస్సున్న విద్యార్థులకు మ్యాన్‌డేట్‌ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ (ఎంబీయూ) చేయించేందుకు ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు నిర్వహించనున్నట్లు వివరించారు. విద్యార్థుల ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేయించేందుకు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు నిర్వహించి ఎంబీయూ పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నామన్నారు.

ప్రత్యేక ఆధార్‌ శిబిరాల తేదీలు...

D¯ðlÌS 8Ð]l ™ól© ¯]l$…_ 11Ð]l ™ól© Ð]lÆý‡MýS$, 21 ¯]l$…_ 25Ð]l ™ól© Ð]lÆý‡MýS$️ Ððl¬™èl¢… 9 ÆøkÌS ´ër$ {ç³™ólÅMýS B«§éÆŠ‡ Õ¼-Æ>Ë$ °Æý‡Ó-íßæ-Ýë¢Æý‡-¯é²Æý‡$. ºÄñæ*-Ððl${sìæMŠS A‹³-yólçÙ¯ŒS ò³…yìl…VŠæÌZ E¯]l² ѧéÅ-Æý‡$¦Ë$ D {ç³™ólÅMýS B«§éÆŠ‡ Õ¼Æ>-ÌS¯]l$ çܨ-Ó-°-Äñæ*VýS… ^ólçÜ$MýS$° ™èlÐ]l$ B«§é-ÆŠ‡ÌZ ™èlç³µ-°-çÜ-ÇV> ºÄñæ*Ððl$-{sìæMŠS A‹³-yólsŒæ ç³NÇ¢ ^ólçÜ$-MøÐéÌS° A«¨-M>-Æý‡$Ë$ çÜ*_…-^éÆý‡$.

మార్కాపురం: మార్కాపురం జిల్లా లాన్‌ టెన్నిస్‌ అసిసోసియేషన్‌ అధ్యక్షునిగా డాక్టర్‌ జీకే మోహన్‌ రెడ్డి ఎన్నికయ్యారు. పట్టణంలోని స్థానిక టెన్నిస్‌ ప్రాంగణంలో ఆదివారం మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం ప్రాంతాలకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కనిగిరికి చెందిన జి.అల్లు సత్యనారాయణ, కోశాధికారిగా పట్టణానికి చెందిన ఐ.అశోక్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా సీహెచ్‌.మోహన్‌రావు, కె.మనోహర్‌ రెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎస్‌కేటీ వలి, ఉప కార్యదర్శులుగా షేక్‌.ఇబ్రహీం, వి.చంద్రశేఖర్‌, గౌరవ సలహాదారులుగా షేక్‌.అబ్దుల్‌ గఫార్‌, జి.వి.రాఘవులు, టి.కునాల్‌, కార్యవర్గ సభ్యులుగా ఎం.వి.ఎస్‌. రమేష్‌, షేక్‌.షబ్బీర్‌, వై.రామకోటేశ్వరరావు, యు.మహేష్‌ కుమార్‌, ఎస్‌.ప్రదీప్‌ రెడ్డి, షేక్‌.అబ్దుల్లా, ఎం.పృథ్వీరెడ్డి, ఎం.ప్రసాద్‌, పి.చంద్రశేఖర్‌, ఎస్‌.విజయ్‌ కుమార్‌, షేక్‌.సమైర్‌, టెన్నిస్‌ అసోసియేషన్‌ కోచ్‌గా సీహెచ్‌.మురళీమోహన్‌ రెడ్డి, అసోసియేషన్‌ వైద్య నిపుణులుగా ఎన్‌.సందీప్‌ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆయన తెలిపారు. నూతన సభ్యులందరూ టెన్నిస్‌ క్రీడను అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషిచేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement