● నివాళులర్పించిన వైఎస్సార్ సీపీ నాయకులు
ఒంగోలు సిటీ: ఒంగోలు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ తదితరులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాధాకృష్ణన్ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి జూపూడి ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యే లు అన్నా రాంబాబు, కె.నాగార్జునరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జ్ చింతలపూడి అశోక్‌కుమార్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ.రమణారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, కర్నేటి ప్రసాద్, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు.


