కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Sep 6 2026 2:07 AM | Updated on Sep 6 2026 2:07 AM

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ఉలవపాడు: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని కరేడులో శనివారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. కరేడు యాదవ్‌ కాలనీకి చెందిన వాకా వెంకటేశ్వర్లు (49) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు నెలలుగా దంపతులు, పిల్లల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గొర్రెలు మేపేందుకు పొలం వెళ్లి వచ్చి చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక సీహెచ్‌సీ వైద్యశాలకు తరలించారు. కందుకూరు సీఐ ఎస్‌కే అన్వర్‌బాషా తన సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఎస్సై శివయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement