హాస్టల్‌ మూసేయాలంటూ తౌషిక్‌ తల్లి నిరసన | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ మూసేయాలంటూ తౌషిక్‌ తల్లి నిరసన

Sep 6 2026 2:07 AM | Updated on Sep 6 2026 2:07 AM

హాస్టల్‌ మూసేయాలంటూ తౌషిక్‌ తల్లి నిరసన

సింగరాయకొండ: స్థానిక శ్రీచైతన్య నవోదయ స్కూల్‌ యాజమాన్యం అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హాస్టల్‌ను మూసి వేయాలంటూ శనివారం తౌషిక్‌ తల్లి సయ్యద్‌ మౌలాబీ స్కూల్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన దీక్ష చేసింది. హాస్టల్‌కు అనుమతుల విషయమై విద్యాశాఖ అధికారులు స్పందించాలని కోరుతూ ఆమె ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ తన కుమారుడి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని నిరసన దీక్ష చేస్తున్న మౌలాబీ ఇప్పుడు అనుమతులు లేని హాస్టల్‌ను మూసి వేయాలంటూ దీక్ష చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement