నాగులుప్పలపాడు: మండలంలోని కనపర్తి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని శుక్రవారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి డా.మేరుగు నాగార్జున ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణకు మండలంలోకి ప్రవేశించిన ఎంపీ, ఎమ్మెల్యేలకు చదలవాడ గ్రామం వద్ద ఎంపీపీ దంపతులు నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి, వ్యవసాయ విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ళ బంగారుబాబు, మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, మండల నాయకులు, మహిళలు హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చదలవాడ నుంచి కనపర్తి వరకు 17 కి.మీ సాగిన బైక్ ర్యాలీలో యువకులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. అగ్రహారం, చీర్వానుప్పలపాడు, అమ్మనబ్రోలు, వినోదరాయునిపాలెం, దాసరివారిపాలెం గ్రామాలలో కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం కనపర్తి గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ కొమ్మూరి కనకారావు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, రాష్ట్ర మేధావుల సంఘం కార్యదర్శి కంచర్ల సుధాకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, జడ్పీటీసీ లు వేమా శ్రీనివాసరావు, తేళ్ళ పుల్లారావు, మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, కనపర్తి గ్రామాధ్యక్షుడు విజయ సింహరెడ్డి, నారపరెడ్డి, గోపిరెడ్డి, అంజిరెడ్డి, ఎంపీటీసీ లు, మాజీ సర్పంచ్‌లు, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు
వైఎస్సార్ విగ్రహానికి గజమాలతో నివాళులర్పిస్తున్న వైవీ సుబ్బారెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ, మేరుగు నాగార్జున, నాయకులు


