బల్లికురవ: విద్యార్థులకు విద్యాబోధనతో పాటు వారిని వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దుతున్నారు కొప్పెరపాడు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.శ్రీనివాసరావు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై న ఆయన గతంలో చిలంకూరు, తర్లుపాడు, బూదవాడ, కోటపాడు, దద్దుకూరు పాఠశాలల్లో పనిచేశారు. పనిచేసిన ప్రతి చోటా పెద్దలచే సన్మానాలు అందుకున్నాడు. పనిచేసే చోట నివాసం ఉంటూ తోటి ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటునిచ్చారు. పాఠశాలను నాడు–నేడుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దాంతో పాఠశాలను పీఎంశ్రీకి ఎంపికయ్యేలా కృషిచేశారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడం, ఎన్‌ఎంఎంఎస్‌లో 46 మంది ఎంపికకు కృషి, కౌశిల్ క్విజ్ చెకుముకిలో రాష్ట్ర స్థాయిలో విన్నర్స్‌గా విద్యార్థులు నిలిచేలా కృషిచేశారు. సహచర ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాలలోని విద్యార్థులకు ఉత్తమ బోధన అందించారు.


