పది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి చదువుకుంటున్నాను. శ్రీనివాసరావు మాస్టారు చాలా మంచాయన. మమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తారు. తెలియనివి చెబుతుంటారు.
– వీఎస్‌ఎన్‌వీ నందకిశోర్, తొమ్మిదో తరగతి
మాస్టారు ప్రోత్సాహంతో జిల్లా అవార్డు..
మా హెడ్ మాస్టారు ఇచ్చే ప్రోత్సాహం చాలా బాగుంటుంది. నేను ఆరో తరగతి నుంచి ఇక్కడే చదువుతున్నాను. వినియోగదారుల దినోత్సవ సందర్భంగా నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి వ్యాసరచన, డిబేట్‌లో పాల్గొనేలా చేశారు. నాకు జిల్లా స్థాయి అవార్డు వచ్చింది.
– పీ లక్ష్మీ అమూల్య, పదో తరగతి


