ఒంగోలు సబర్బన్: రహదారి ప్రమాదాల నివారణ, బాధితుల ప్రాణరక్షణే ధ్యేయంగా అధికార యంత్రాంగంతో కలిసి పనిచేయాలని ‘సేవ్ లైఫ్ ఫౌండేషన్’ ప్రతినిధులకు కలెక్టర్ పి.రాజాబాబు సూచించారు. మంగళవారం ఆ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తన నేతృత్వంలో ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఆర్.సుశీల, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, ఎన్‌హెచ్‌ఏఐ ప్రతినిధులు, ఇతర అధికారులతో కూడిన ‘రహదారి భద్రత కమిటీ’ చేపడుతున్న చర్యలు, సాధించిన ఫలితాలను వివరించారు. రహదారి భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ముందుకొచ్చే సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. జీరో ఫెటాలిటీ డిస్ట్రిక్ట్ లక్ష్యంగా సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. సమావేశంలో డీటీసీ ఆర్.సుశీల, జిల్లా రవాణా శాఖ కార్యాలయ ఏఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
‘సేవ్ లైఫ్ ఫౌండేషన్’తో వీడియో
కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజాబాబు


