పశ్చిమ ప్రకాశం జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టును 2005 మే నెలలో వైఎస్సార్ స్వయంగా గొట్టిపడియ, సుంకేశుల, కాకర్ల గ్యాప్ డ్యామ్ పనులతో పాటు దోర్నాల మండలం కొత్తూరు వద్ద 18.8 కిలోమీటర్ల పొడవైన రెండు టన్నెళ్ల తవ్వకాన్ని ప్రారంభించారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 మండలాల పరిధిలోని 15.20 లక్షల మందికి తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. అయితే టీడీపీ హయాంలో 2014–19 మధ్య మందగించిన ఈ పనులను, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ప్రత్యేక చొరవతో కరోనా కష్టకాలంలోనూ శరవేగంగా నడిపించారు. మధ్యంతర రంధ్రాలు లేని ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాలను రికార్డు సమయంలో పూర్తి చేసి, 2024 మార్చి 6న వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం ద్వారా తండ్రి ఆశయాన్ని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.


