అద్దంకి రూరల్: పట్టణంలోని భవానీ సెంటర్ వేయి స్తంభాల గుడి ఎదురుగా మద్యం మత్తులో కొందరు యువకులు పరస్పరం రాళ్లు రువ్వుకుంటూ వీరంగం సృష్టించారు. మంగళవారం సాయంత్రం శింగరకొండ వైపు నుంచి బైకులపై వచ్చిన కొందరు, రేణింగవరం రోడ్డు వైపు నుంచి వచ్చిన మరో వర్గంతో ఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు వారిని వారించేందుకు ప్రయత్నించగా.. ఆవేశంతో చొక్కాలు విప్పి, బైకులను అతివేగంగా నడుపుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇటువంటి అసాంఘిక చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.


