న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తూ విద్యా బోధనలో విశిష్ట సేవలందించిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆరుగురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వీరిని పురస్కారాలతో సత్కరించనుంది. జిల్లాకు చెందిన ఆరుగురికి ఈ అరుదైన గౌరవం దక్కడంతో విద్యాశాఖలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
● ఉమ్మడి జిల్లాలో ఆరుగురు ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి పురస్కారాలు ● ప్రకాశం జిల్లాలో ఇద్దరు ● మార్కాపురం జిల్లాలో నలుగురు
సాక్షి నెట్‌వర్క్:
ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆరుగురు ఎంపికయ్యారు. వీరిలో ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు, మార్కాపురం జిల్లా నుంచి నలుగురు ఉన్నారు. ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం మువ్వా రాధిక, బల్లికురవ మండలం కొప్పెరపాడు జెడ్పీ స్కూల్ హెచ్‌ఎం శ్రీనివాసరావు, మార్కాపురం పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మ్యాథ్స్ టీచర్ కె.వేణుగోపాల్, చింతగుంట్ల ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్న ఎస్‌జీటీ రమేష్, హజరత్‌గూడెంలో పనిచేస్తున్న సరోజ, బోడపాడు ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్న పీ శ్రీనివాసులు ఉన్నారు.


