సమాజంలో ప్రతి ఒక్కరికీ ఒక కుటుంబం ఉంటుంది. భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, అన్నా చెల్లెల్లు ఉంటారు. వారి మధ్య మమకారాలు, అనుబంధాలు ఉంటాయి. భావోద్వేగాలు ఉంటాయి. కుటుంబంలో దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబ యజమానికో, చేతికందివచ్చిన కొడుకుకో జరగరానిది జరిగితే ఆ కుటుంబం పరిస్థితి తలకిందులవుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకోని కుటుంబమైతే భార్యాబిడ్డలు రోడ్డున పడతారు. రోడ్డు ప్రమాదాలలో చాలా కుటుంబాలు ఇలాగే నష్టపోతున్నాయి. ఆ విషాదం నుంచి కోలుకోలేని కుటుంబాలెన్నో ఉన్నాయి. ఒక్కొక్కరిని కదిలిస్తే చాలు.. కన్నీటి ప్రవాహాలవుతుంటారు. వారిని చూసినప్పుడల్లా గుండె తరుక్కుపోతుంటుంది. ప్రయాణాలు చేసే సమయంలో ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటాను. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఇటీవల అనేక చర్యలు తీసుకున్నానన్నారు ఎస్పీ హర్షవర్థన్‌రాజు.


