పాఠశాల ప్రగతికి పాటుపడి.. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొంది... | - | Sakshi
Sakshi News home page

పాఠశాల ప్రగతికి పాటుపడి.. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొంది...

Sep 4 2026 2:24 AM | Updated on Sep 4 2026 2:24 AM

ఒంగోలు సిటీ: ప్రభుత్వ పాఠశాల అంటేనే వెనుకబడిన విద్యకు చిరునామా అన్న భావనకు చెక్‌ పెడుతూ.. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా విద్యా ప్రమాణాలు పెంచారు. విద్యార్థుల సంఖ్య పెంచడం నుంచి పదో తరగతి ఫలితాల వరకు పీవీఆర్‌ మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాల గణనీయమైన ప్రగతి సాధించింది. ఈ విజయాల వెనుక ప్రధానోపాధ్యాయురాలు మువ్వ రాధిక నాయకత్వం, ఉపాధ్యాయుల సమష్టి కృషి, తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకంగా నిలిచాయి. పాఠశాలలో చేపట్టిన కార్యక్రమాలు, నమోదైన ప్రగతిని పరిగణనలోకి తీసుకుని లీప్‌ యాప్‌ ద్వారా మువ్వ రాధికను రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement