కొనకనమిట్ల: మండలం చింతగుంట హరిజనవాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం వి.రమేష్ రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. సెంకడరీ గ్రేడ్ టీచర్ విభాగంలో ఆయనను ఎంపిక చేశారు. 2008 డీఎస్సీ ద్వారా ఉద్యోగాన్ని పొందిన రమేష్.. ఎఫ్‌ఎల్‌ఎన్, టీఏఆర్‌ఎల్ వంటి వాటికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్‌గా పనిచేశారు. టెస్ట్ బుక్స్‌లో వచ్చే క్యూఆర్ కోడ్స్‌కి రాష్ట్ర స్థాయిలో రిసోర్స్ పర్సన్‌గా పనిచేశారు. పిల్లల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. టీఎల్‌ఎం తయారీకి సంబంధించిన ట్రైనింగ్ కోసం మైసూర్ కూడా వెళ్లొచ్చారు.


