టంగుటూరు: నిద్రమత్తులో ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని సూరారెడ్డిపాలెం జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. పోలీసులు వివరాల మేరకు..సూరారెడ్డిపాలెం వద్ద ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలోని ఒంగోలు నుంచి కందుకూరు వెళుతున్న కారు..రోడ్డు మార్జిన్‌లో ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కొని పోయింది. సమాచారం అందుకున్న హైవే మొబైల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కున్న మహిళలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కారు నడుపుతున్న కందుకూరు మండలం మహదేవపురం గ్రామానికి చెందిన మేడికొండ హరిబాబు(50) అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి కూతుళ్లు జయమ్మ, రాణిలకు గాయాలయ్యాయి. జాతీయ రహదారి పెట్రోలింగ్ సిబ్బంది ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చేశారు. ఎస్సై ఫణిభూషణ్ సంఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొన్న కారు
అక్కడికక్కడే ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
సూరారెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం


