చీమకుర్తి: ప్రేయసితో కలిసి జల్సా ఖర్చుల కోసం అత్తను అల్లుడు హత్య చేశాడు. రెండు రోజుల క్రితం చీమకుర్తి శివారు జగనన్న కాలనీలో షేక్ మీరాబీ హత్య సంఘటనలో నిందితుడిగా ఉన్న చిన్న అల్లుడు మీరావలిని, అతడి ప్రేయసి కేశారపు అచ్యుతను మంగళవారం పోలీసులు చీమకుర్తి శివారు గ్రామంలో అరెస్టు చేశారు. ఈ సందర్బంగా పోలీస్‌స్టేషన్‌లో సీఐ డి.ప్రసాద్, ఎస్సై సంపత్‌కుమార్ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హత్య వివరాలు వెల్లడించారు. ప్రేయసితో కలిసి మస్తాన్‌వలి అత్త మీరాబీ ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా హత్యకు పాల్పడ్డారు. చెవులకు ఉన్న జత కమ్మలు, జాలరితో పరారయ్యారు. తొలుత ఖర్చుల కోసం అత్తను చెవి కమ్మలు ఇవ్వమని అడగటంతో దానికి మీరాబీ నిరాకరించింది. దానితో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దిండుతో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో స్పష్టమవడంతో మస్తాన్‌వలిని, అచ్యుతను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడంతో కోర్టు రిమాండ్ విధించినట్లు సీఐ, ఎస్సై తెలిపారు.
సింగరాయకొండ: మండల పరిధిలోని జాతీయ రహదారిపై పోలేరమ్మ గుడి సమీపంలోని పొలాల్లో మంగళవారం సుమారు 45 ఏళ్ల గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న జరుగుమల్లి ఇన్‌చార్జి ఎస్సై భాగ్యరాజ్, వీఆర్‌వో మాధవి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు యాచకురాలై ఉండవచ్చని, వడదెబ్బ లేదా గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గార్లదిన్నె (అనంతపురం): మండల పరిధిలోని మర్తాడులో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దర్శి మండలం పెద్ద ఉయ్యాలవాడకు చెందిన నాగెండ్ల శ్రీధర్ (40) అనే వ్యక్తి కొద్ది రోజులుగా అనంతపురం జిల్లా కేంద్రంలో బేల్దారి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇటీవల సొంత గ్రామంలో మేనమామ చనిపోయిన విషయం కుటుంబ సభ్యులు శ్రీధర్‌కు చెప్పలేదు. మూడు రోజుల తర్వాత తెలిసింది. మేనమామ చనిపోయిన విషయం చెప్పలేదని బాధపడుతుంటే భవన నిర్మాణ పనుల మేసీ్త్ర రూ.1000 నగదు అందజేసి సొంత గ్రామం వెళ్లాలని సూచించారు. శ్రీధర్ అనంతపురంలో బస్సు ఎక్కి మద్యం మత్తులో గార్లదిన్నెలో దిగి నడుచుకుంటూ మర్తాడుకు వెళ్లాడు. ఈ నెల 24న మర్తాడులో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి 108కు సమాచారం అందించగా చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గౌస్ మహ్మద్ బాషా తెలిపారు.


