గెజిట్‌లో నా పేరు స్పష్టంగా ఉన్నప్పటికీ, కేవలం కార్డుల్లో పేర్ల వ్యత్యాసాన్ని సాకుగా చూపి అధికారులు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని నిలిపివేశారు. రేషన్ కార్డులో ‘చిన్నకాసులు’ అని, ఆధార్ కార్డులో ‘పెద్దకాశిరాజు’ అని ఉంది. తండ్రి పేరు, ఇంటి పేరు రెండూ సరిగ్గానే ఉన్నాయని తహసీల్దార్ కార్యాలయం నుంచి అవసరమైన అన్ని ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలు తెచ్చిచ్చినా అధికారులు కనికరించడం లేదు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగి జిరాక్స్ ప్రతులు సమర్పించినా మళ్లీ తేవాలని చెబుతున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదు. కాగితాల జిరాక్స్‌లకే వేలకు వేలు ఖర్చవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నాకు రావాల్సిన పునరావాస ప్యాకేజీ మంజూరు చేయాలి.
– తంగిరాల పెద్దికాశిరాజు, సుంకేసుల గ్రామం
అర్హులైన యువతకు ప్యాకేజీ ఇవ్వాలి
ప్రాజెక్టు సర్వే చేసే సమయానికి నాకు ఏడేళ్లు. అప్పటి అధికారులు నా పేరును గెజిట్‌లో నమోదు చేశారు. ప్రస్తుతం నాకు వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. గెజిట్ నమోదులో చిన్న తప్పులను బూచిగా చూపి అధికారులు ప్యాకేజీ నిలిపివేశారు. తహసీల్దార్ నుంచి పరిహారం ఇవ్వవచ్చని సర్టిఫికెట్ తెచ్చి ఇచ్చినా కాలయాపన చేస్తున్నారే తప్ప ఇప్పటివరకు ప్యాకేజీ ఇవ్వలేదు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా గ్రామం విడిచి వెళ్లి మా కుటుంబం ఎలా బతకాలి? ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ ప్యాకేజీ వర్తింపజేయాలి.
– తోట అనిల్, సుంకేసుల గ్రామం
పరిహారమివ్వకుండా ఖాళీ చేసే ప్రసక్తే లేదు
గతంలో నా ఇంటికి సంబంధించి నష్టపరిహారం చెక్కు ఇచ్చారు. కానీ ప్రస్తుత గెజిట్ జాబితాలో నా పేరును అధికారులు చేర్చలేదు. దీనిపై ఎన్నిసార్లు జిరాక్స్ కాగితాలు ఇచ్చి వేడుకున్నా అధికారుల్లో చలనం లేదు. పునరావాస ప్యాకేజీ సొమ్ము ఇవ్వకుండా ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపొమ్మంటే ఎక్కడికి పోవాలి? ఎలా జీవించాలి? అందరిలాగే నాకూ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇస్తేనే ఇల్లు ఖాళీ చేస్తాను. లేదంటే ఇక్కడే ప్రాణాలైనా విడుస్తాను తప్ప గ్రామం విడిచి వెళ్లేది లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాకు రావాల్సిన పరిహారం అందించాలి.
– కొండేటి చిన్న కాశయ్య, కలనూతల గ్రామం


