ఒంగోలు సబర్బన్: ప్రజల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన పెంపొందించడంతో పాటు అపోహలు, వివక్షను తొలగించే దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. ప్రకాశం భవన్‌లోని పీజీఆర్‌ఎస్ మందిరంలో సోమవారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(ఏపీశాక్స్) రూపొందించిన శ్రీఆరోగ్య కరదీపికశ్రీ, ఆరోగ్య సమాచార క్యూఆర్ కోడ్ కరపత్రాలను ఆవిష్కరించారు. శాసీ్త్రయ అవగాహనతోనే వ్యాధిని అరికట్టవచ్చని జిల్లా అదనపు వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో రెండు నెలల పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ జి.బాలాజీ తెలిపారు. వ్యాధి నివారణ, పరీక్షలు, చికిత్సపై ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జేసీ కల్పనాకుమారి, డీఆర్వో, వైద్యారోగ్య అధికారులు, హెల్ప్ సంస్థ పీడీ బీవీ సాగర్, సీఎస్‌ఓ ఎస్.సాయి, జీఆర్‌ఓ, ఎస్‌ఎన్‌ఐఆర్‌డీ ప్రోగ్రామ్ మేనేజర్లు ఎస్.కె.పీర్‌బాషా, వెంకటేశ్వర్లు, లింక్ వర్కర్స్ స్కీం డీపీఎం గాలి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య కరదీపిక ఆవిష్కరణలో
కలెక్టర్ రాజాబాబు


