మార్కాపురం:
బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని మార్కాపురం ఓఎస్డీ నవజ్యోత్ మిశ్రా తెలిపారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లాలోని 21 మండలాల ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత స్టేషన్లకు పంపి వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఎంతో నమ్మకంతో పోలీసుల వద్దకు వచ్చే ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని అధికారులను ఆదేశించారు. ఎస్పీ కార్యాలయానికి రాలేని వారు స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ లేదా సబ్‌డివిజన్ కార్యాలయాల్లో కూడా తమ ఫిర్యాదులు అందజేయవచ్చని సూచించారు. కాగా, ఈ గ్రీవెన్స్‌కు భూవివాదాలు, ఆర్థిక లావాదేవీలు, మోసాలు, కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులకు సంబంధించి మొత్తం 44 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఎస్పీ డాక్టర్ నాగరాజు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఓఎస్డీ నవజ్యోత్ మిశ్రా వెల్లడి
పోలీస్ గ్రీవెన్స్‌కు 44 ఫిర్యాదులు


