మాయాజాలం | - | Sakshi
Sakshi News home page

మాయాజాలం

Jan 4 2026 6:54 AM | Updated on Jan 4 2026 6:54 AM

మాయాజ

మాయాజాలం

జరుగుమల్లి వెలుగులో

జరుగుమల్లి వెలుగులో

జరుగుమల్లి (సింగరాయకొండ):

జిల్లాలోని జరుగుమల్లి వెలుగు అధికారుల తీరు రోజురోజుకూ ముదిరి పాకాన పడుతోంది. గతంలో వీఏఓగా పని చేసిన సుకన్యను ఉద్దేశం పూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆమైపె వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరురాలిగా ముద్ర వేసి టీడీపీ నాయకులు, ఆశాఖ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఆమెను వీఓఏగా విధుల నుంచి తొలగించినా ఆన్‌లైన్‌లో పేరు తొలగించకుండా ఫోర్జరీ సంతకాలతో సంవత్సర కాలంగా జీతం డ్రా చేసుకుంటున్నారు. చివరికి రూ.12.76 లక్షలు చెల్లించాలంటూ సుకన్యపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు.

ఇదీ..జరిగింది

జరుగుమల్లి మండలం వావిలేటిపాడు–2 గ్రామైఖ్య సంఘం వీఓఏగా గ్రామానికి చెందిన సుకన్య గతంలో విధులు నిర్వర్తించింది. ఆమెను 2024 డిసెంబర్‌లో తొలగించి కడియాల అనూరాధను నియమించారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగి భార్యను వీఓఏగా నియమించకూడదు. అనూరాధ భర్త ఆర్టీసీ డ్రైవర్‌. అంతేగాక గ్రూపుల్లో సభ్యులు కాని వారిని కూడా వీఓఏగా నియమించకూడదు. అనూరాధ 2023లో గ్రామంలోని వల్లూరమ్మ గ్రూపు నుంచి సభ్యుల ఆమోదం మేరకు పక్కకు వెళ్లింది. ఆ ప్రకారం గ్రూపు సభ్యులు తీర్మానం చేసి సంతకాలు కూడా చేశారు. ఇటీవల అనూరాధ గ్రూపు సభ్యులకు తెలియకుండా ఎటువంటి తీర్మానం లేకుండా తన పేరు వల్లూరమ్మ గ్రూపులో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంది. అధికారుల సహకారంతో ఏడాదిగా వీఓఏగా ఆన్‌లైన్‌లో పేరు లేనప్పటికీ అనూరాధ గ్రామైఖ్య సంఘానికి తెలియకుండా ఫోర్టరీ సంతకాలతో జీతం డ్రా చేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రూ.12.76 లక్షలు చెల్లించాల్సిందే

ప్రస్తుతం వావిలేటిపాడు–2 వీఓఏకు సంబంధించి ఆన్‌లైన్‌లో చూపిస్తున్న రూ.12.76 లక్షలు చెల్లించాల్సిందేనని తనపై ఏపీఎం జయరాజ్‌, సీసీ సాంబయ్య ఒత్తిడి చేస్తున్నారని సుకన్య ఆరోపిస్తోంది. తాను చెల్లించాలని చెప్తున్న రూ.12.76 లక్షల మొత్తానికి పూర్తి ఆధారాలతో సహా ఏపీఎం జయరాజ్‌కు వివరించానని, తాను ఒక్క రూపాయి కూడా చెల్లించక్కరలేదని, అవసరమైతే గ్రామైఖ్య సంఘం సమావేశం ఏర్పాటు చేయాలని కూడా కోరానని, ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదని సుకన్య అధికారుల పనితీరును దుయ్యబడుతోంది. ఇప్పటికీ నాలుగుసార్లు మీ కోసం కార్యక్రమంలో తనను నగదు చెల్లించాలని వేధిస్తున్నారంటూ అర్జీలు కూడా ఇచ్చానని, సుకన్య డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అప్పుడు ఏపీఎం జయరాజ్‌ ఉన్నతాధికారులకు కూడా నివేదిక ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని సుకన్య కన్నీటిపర్యంతమవుతోంది. గ్రామ సమైఖ్య సంఘం ఆధ్వర్యంలో గ్రూఫు సమావేశం ఏర్పాటు చేయాలని కూడా కోరానని, సంవత్సరం కాలంగా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదన్నారు. వెలుగు అధికారుల ఒత్తిడితో తన ఆరోగ్యం కూడా దెబ్బతిందని, తనకు ఏదైనా జరిగితే దానికి అధికారులే బాధ్యత వహించాలని సుకన్య కోరుతోంది. కేవలం వైఎస్సార్‌ సీపీ సానుభూతి పరురాలనే కారణంతో తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని, జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి తన పేరు ఆన్‌లైన్‌లో తొలగించాలని, తాను చెల్లించాలని చెబుతున్న రూ.12.76 లక్షలకు గ్రూపు సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్‌ చేస్తోంది.

ఏకపక్షంగా వావిలేటిపాడు–2 వీఓఏ సుకన్య తొలగింపు

ఆమెను తొలగించి ఏడాది దాటినా అన్‌లైన్‌లో మారని పేరు

నిబంధనలకు విరుద్ధంగా కొత్త వీఓఏ నియామకం

ఫోర్జరీ సంతకాలతో జీతం డ్రా

సమగ్ర విచారణ కోసం మాజీ వీఓఏ సుకన్య డిమాండ్‌

సుకన్య పేరును వెంటనే తొలగిస్తాం:

వావిలేటిపాడు–2 వీఓఏగా ఆన్‌లైన్‌లో ఉన్న సుకన్య పేరును వెంటనే తొలగిస్తాం. ఆన్‌లైన్‌లో ఆమె రూ.12.76 లక్షలు చెల్లించాలని చూపుతోంది. కానీ సుకన్య చెబుతున్నట్లు ఆన్‌లైన్‌కు, ఆఫ్‌ లైన్‌కు తేడా వస్తుంది. కొన్ని పద్దులు తప్పుగా నమోదయ్యాయి. దీనిపై విచారించేందుకు వచ్చే వారంలో డీఆర్‌డీఏ ఏజీఎం ఉదయ్‌ వస్తున్నారు. అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది.

– డి.జయరాజ్‌, ఏపీఎం, జరుగుమల్లి

మాయాజాలం1
1/2

మాయాజాలం

మాయాజాలం2
2/2

మాయాజాలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement