రైలు కిందపడి యువకుడు మృతి
బేస్తవారిపేట: రైలు కిందపడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని జేబీకేపురం సమీపంలో రైల్వే ట్రాక్‌పై సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఖరగ్‌పూర్‌కు చెందిన షేక్ రఫీపుల్(34) గోవాలో కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. స్వగ్రామం వెళ్లేందుకు హుబ్లీలో వాస్కోడిగామా రైలు ఎక్కాడు. జేబీకేపురం వద్దకు వచ్చేసరికి ప్రమాదవశాతు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. చుట్టుపక్కల పొలాల్లోని రైతులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మార్కపురం రైల్వే ఏఎస్సై వెంగల్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మార్కాపురం: వేటమాంసం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జి.నాగరాజు తెలిపారు. మండలంలోని నాగులవరం గ్రామ సమీపంలో ఊసా రామయ్య, దండేబోయిన ఆంజనేయులు ఇద్దరూ అడవి పందిని ఉచ్చులు వేసి చంపి మాంసాన్ని విక్రయిస్తుండగా వారిని అదుపులోనికి తీసుకొని 5 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. వన్యప్రాణులను సంహరిస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. బీట్ ఆఫీసర్ రవికుమార్, నిరంజన్, సుభాని పాల్గొన్నారు.
కొత్తపట్నం: కుటుంబ సమస్యల నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామానికి చెందిన గువ్వల గరటయ్య (28) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. సోమవారం పనికి వెళ్లకుండా తన పొలంలోని పశువుల షెడ్‌లో వైరుతో ఉరి వేసుకున్నాడు. ఎనిమిది నెలల క్రితం అతని తల్లి గువ్వల సుబ్బరత్నమ్మ కూడా అదే షెడ్‌లో ఉరివేసుకుని మృతి చెందింది. అప్పటి నుంచి గరటయ్య మనోవేదనతో ఉంటున్నాడు. తల్లి చనిపోవడం, తనకు వివాహం కాకపోవడం, పనికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి పట్టించుకునేవారు ఎవరూ లేకపోవడం, సరైన ఆహారం లేకపోవడం వంటి సమస్యలతో మనస్తాపం చెంది తన తల్లి ఎక్కడ ఉరివేసుకుందో అక్కడే ఉరివేసుకుని మృత్యువాతపడినట్లు తెలుస్తోంది. తండ్రి గువ్వల సుబ్బారావు పొలం వెళ్లి చూడగా, కుమారుడు శవమై వేలాడుతూ కనిపించడంతో కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. స్థానిక ఎస్సై వేముల సుధాకర్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గువ్వల చిన్నసుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కి మృతదేహాన్ని తరలించారు. ఎనిమిది నెలల క్రితం భార్య, ఇప్పుడు కుమారుడు వరుసగా ఉరి వేసుకుని చనిపోవడంతో చిన్న సుబ్బారావు భోరున విలపిస్తున్నాడు.
కొత్తపట్నం: మండలంలోని ఈతముక్కల శివారు ప్రాంతంలో పేకాట శిబిరంపై సోమవారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. ఎస్సై వేముల సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది దాడి చేసి నలుగురు జూదరులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.4,510 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని మంగళవారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు.
రైలు కిందపడి యువకుడు మృతి
రైలు కిందపడి యువకుడు మృతి
రైలు కిందపడి యువకుడు మృతి


