450 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం
టంగుటూరు: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన స్థానిక కొండపి ఫ్‌లైఓవరు సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చిలకలూరిపేట నుంచి నెల్లూరు వైపునకు రేషన్ బియ్యాన్ని లారీలో తరలిస్తున్నారని సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ లారీలో 450 బస్తాల పీడీఎస్ బియ్యం గుర్తించారు. అనంతరం లారీని, అందులో ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకొని స్థానిక పోలీసు స్టేషనుకు తరలించి, అన్నలదాసు పవన్ రాజు, కిషోర్, శ్రీనివాసులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లీశ్వరరావు తెలిపారు.
దర్శి: ఉద్యోగులు, కార్మికులందరూ సుఖసంతోషాలుగా ఉండాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆకాంక్షించారు. దర్శి నియోజకవర్గ 2026 నూతన సంవత్సర సీఐటీయూ క్యాలెండర్‌ను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సీఐటీయూ నాయకులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ సీఐటీయూ పేద కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉద్యోగ, కార్మికుల సమస్యలపై పోరాడి పరిష్కరించే కార్యకర్తలు సీఐటీయూ సంఘాలకు ఉన్నారని చెప్పారు. ప్రజల పక్షాన పనిచేసే ప్రజా సంఘాలు ఉండాలని, వారికి తమ మద్దతు, సహాయం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తాండవ రంగారావు మాట్లాడుతూ కార్మిక, ఉద్యోగుల ఐక్యత, పోరాటం లక్ష్యాలతో సీఐటీయూ ఏర్పడి అసంఘటిత కార్మికులు, స్కీం వర్కర్స్, కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్నామని చెప్పారు. నూతన సంవత్సరంలో కార్మికుల పోరాటాలు విజయవంతం కావాలని కోరారు. ఈ ఆవిష్కరణలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ ఎస్‌ఎం బాషా, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, కొత్తపల్లి సర్పంచ్ బట్టు రామారావు, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, మజ్ఞువలి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు లక్ష్మిరెడ్డి, సీఐటీయూ మండల నాయకులు ఉప్పు నారాయణ, షేక్ కాలే బాషా, సీహెచ్ ఆదినారాయణ, గర్నిపూడి జాన్ సామ్యేల్, సందు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గుడ్లూరు: మండలంలోని రామాయపట్నం పోర్టును ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మొండివారిపాలెం వద్ద మంగళవారం సందర్శించారు. అనంతరం ఇండోసోలార్ ప్లాంటును పరిశీలించారు. ఆయన వెంట కందుకూరు డీఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, గుడ్లూరు సీఐ మంగారావు, ఎస్‌ఐ వెంకట్రావు, మైరెన్ ఎస్‌ఐ షరీఫ్ ఉన్నారు.
బల్లికురవ: సంక్రాంతి సందర్భంగా మండలంలోని కొప్పెరపాడులో ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలకు మొదటి నుంచి 4 బహుమతులు వరుసగా రూ.15,116, రూ.10,116, రూ.7,116, రూ.3,116 అందజేస్తున్నట్లు చెప్పారు. బెస్ట్ రైడర్ డిసెండర్లకు రూ.1116 అందజేస్తున్నామని, పాల్గొనదలచిన వారు ఎంట్రీలు పంపాలని కోరారు. పూర్తి వివరాలకు పీ రామకృష్ణ, సెల్: 9494899882 నంబరును సంప్రదించాలని కోరారు.
450 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం
450 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం


